స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీమన్మదనామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి తెలుగు సంవత్సరాది 21-3-2015 తేదీ శనివారము అయినది. అదేరోజు ప్రతినెలా జరిపే ప్రత్యేక సుప్రభాతసేవ మూడవ శనివారము అయినది. కావున ఈరోజు వుదయం 11 గంటలనుండి అలివేలుమంగా పద్మావతి శ్రీవెంకటేశ్వరస్వామి వార్లకు దుర్ఘాదేవికి శ్రీ షిరిడీసాయిబాబాకు శివపార్వతులకు విశేషమైన పూజలు జరుపబడును, తదుపరి పూజారిగారిచే పంచాంగ శ్రవణము జరుపబడును .కావున భక్తులు విచ్చేసి శ్రీ స్వామివార్ల క్రుపకుపాత్రులు కావలెను, భక్తులు ఎవరికితోచిన ప్రసాదములు వారు తీసుకురావలెను
Archive for March, 2015
శ్రీరామనవమి 28-3-2015
స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీమన్మదనామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి ది 28-3-2015 శనివారము అయినది శ్రీరామనవమి సందర్భంగా మన దేవాలయములో సీతారాములకళ్యాణ మహోత్సవము వుదయము 11 గంటలకు ప్రారంభించబడును.కావున భక్తులు ఈ కళ్యాణాన్ని తిలకించి ఆసీతారాముల క్రుపకు పాత్రులు కావలెను .ఎవరైనా దంపతులు ఈ కళ్యాణాన్ని పీఠలపై కూర్చుని చేయించుకోదగినవారు పూజారిగారిని సంప్రదించవలెను.
మాసశివరాత్రి 17-4-2015
శుక్రవారము అయినది ప్రతీనెలా మాసశివరాత్రికి పరమశివునికి ప్రత్యేక అభిషేకములు జరుగును, అభిషేకప్రియుడైన మహాశివునికి అభిషేకములు చేయించే భక్తులకు వారి కుటుంభానికి శుభప్రదం శివపార్వతుల క్రుప కలుగును . ప్రతినెలా జరిగే మాసశివరాత్రికి పాల్గొనే భక్తులు వారు స్వయంగా వచ్చి చేయించుకోవచ్చును వుద్యోగరిత్యా సమయం దొరకనివారు వారి గోత్రనామాలిచ్చి పూజారిగారిచే అభిషేకములు చేయించుకోవచ్చును.వివరాలకు పూజారిగారిని సంప్రదించవలెను .01772798512 ఒర్ ంఒబిలె 07597021071 , ప్రస్తుత పూజారిగారిపేరు చిట్టా వేణునాగశ్యాం.